Lucile Randon Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు సిస్టర్ అండ్రే కన్నుమూత, ద్రలోనే చనిపోయారని తెలిపిన అధికార ప్రతినిధి

వరల్డ్‌లో అత్యధికకాలం జీవించి ఉన్న మహిళగా రికార్డుల్లోకెక్కిన ఫ్రెంచ్ మహిళ సిస్టర్ అండ్రే మంగళవారం కన్నుమూశారు. ఆమె వయసు 118 సంవత్సరాలు. అండ్రే అసలు పేరు లూసిలి రాండన్.. టౌలన్ లోని తన నర్సింగ్ హోమ్ లో రాండన్ మంగళవారం నిద్రలోనే చనిపోయారని హోమ్ అధికార ప్రతినిధి చెప్పారు.

Lucile Randon Dies (Photo-File Image)

వరల్డ్‌లో అత్యధికకాలం జీవించి ఉన్న మహిళగా రికార్డుల్లోకెక్కిన ఫ్రెంచ్ మహిళ సిస్టర్ అండ్రే మంగళవారం కన్నుమూశారు. ఆమె వయసు 118 సంవత్సరాలు. అండ్రే అసలు పేరు లూసిలి రాండన్.. టౌలన్ లోని తన నర్సింగ్ హోమ్ లో రాండన్ మంగళవారం నిద్రలోనే చనిపోయారని హోమ్ అధికార ప్రతినిధి చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధానికి దశాబ్దం ముందు అంటే 1904 ఫిబ్రవరి 11న ఫ్రాన్స్ లోని అలెస్ నగరంలో జన్మించిన అండ్రే.. క్రైస్తవ సన్యాసిగా మారి తన జీవితాన్ని జీసస్ సేవకు అంకితం చేశారు.

అండ్రే ఇప్పటి వరకు మార్సెల్లీ సిటీలోని ఓ నర్సింగ్ హోమ్ లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవిస్తున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన అండ్రే.. మంగళవారం మరణించడం బాధాకరమని నర్సింగ్ హోమ్ ప్రతినిధి చెప్పారు. ‘సిస్టర్ అండ్రే మృతి బాధాకరమే.. అయినా, స్వర్గంలోని తన సోదరుడిని కలుసుకోవాలన్న అండ్రే కోరిక నెరవేరింది’ అంటూ నర్సింగ్ హోమ్ సంతాప ప్రకటన విడుదల చేసింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement