Indonesia Earthquake: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు.. ఈ తెల్లవారుజామున గంటల వ్యవధిలో రెండు ప్రకంపనలు.. 6.1, 5.8 తీవ్రత నమోదు

ఇండోనేషియాను ఈ తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు కుదిపేశాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Jakarta, April 23: ఇండోనేషియాను (Indonesia) ఈ తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు (Earthquakes) కుదిపేశాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో (Kepulauan Batu) 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ మేరకు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్‌సీ-EMSC) తెలిపింది. తొలి భూకంపం భూమికి 43 కిలోమీటర్ల లోతున, రెండోది 40 కిలోమీటర్ల లోతున సంభవించినట్టు పేర్కొంది. అయితే, ఈ భూకంపాల కారణంగా ఎలాంటి నష్టం సంభవించినదీ తెలియరాలేదు. కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. సబాంగ్‌కు  నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement