Rupert Murdoch Call Off Engagement: రూపర్ట్ మర్దోక్ నిశ్చితార్థం రద్దుకు కారణమిదే, ప్రియురాలితో అభిప్రాయాల విషయంలో అసౌకర్యానికి గురైన మీడియా మెఘల్
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి ఎంగేజ్మెంట్ (Engagement) రద్దైనట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్ (media mogul)గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి ఎంగేజ్మెంట్ (Engagement) రద్దైనట్లు తెలుస్తోంది. ఈ వృద్ధ ప్రేమికులు తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు బయటకొచ్చాయి.లెస్లీ స్మిత్ అభిప్రాయాల విషయంలో మర్దోక్ అసౌకర్యానికి గురయ్యారని, పెండ్లి ప్రణాళిక ఆగిపోవడానికి అదే కారణమని వానిటీ ఫెయిర్ తన కథనంలో వెల్లడించింది. తన ప్రియురాలు అయిన 65 ఏండ్ల యాన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith)ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు గత నెలలో మార్దోక్ ప్రకటించారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)