Miss Universe 2020 Winner: మిస్‌ యూనివర్స్‌ 2020గా మెక్సికో యువతి ఆండ్రియా మెజా, మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ, 4వ స్థానంలో నిలిచిన ఇండియా సుందరి అడ్‌లైన్‌ కాస్టెలినో

2020 ఏడాదికి విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా (26) గెలిచారు. మిస్‌ యూనివర్స్‌ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు.

miss-universe-2020-andrea-meza (Photo Credits: Twitter)

2020 ఏడాదికి విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా (26) గెలిచారు. మిస్‌ యూనివర్స్‌ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్‌ హార్డ్‌రాక్‌ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీలో భారతీయ యువతి, మిస్‌ ఇండియా అడ్‌లైన్‌ కాస్టెలినో(22) విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్‌ రన్నరప్‌) నిలిచారు. మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని అలంకరించారు. ఫస్ట్‌ రన్నరప్‌గా(రెండో స్థానంలో) బ్రెజిల్‌ యువతి జూలియా గామా(28), సెకండ్‌ రన్నరప్‌గా(మూడో స్థానంలో) పెరూ యువతి జనిక్‌ మాసెటా(27) నిలిచారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement