Monkeypox: 27 దేశాలకు పాకిన మంకీ ఫాక్స్ వైరస్, ఇప్పటివరకు 780 కేసులు నమోదు, మంకీపాక్స్‌ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు, వివరాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా తర్వాత మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్‌ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Monkeypox (Pic Credit: Twitter)

కరోనా తర్వాత మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్‌ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మంకీపాక్స్‌ వల్ల 7 దేశాల్లో 66 మరణాలు నమోదయ్యాయి.

భారతదేశంలో మంకీపాక్స్‌ వైరస్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ లక్షణాలు బయటకు వచ్చాయి. యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. బాధితురాలి శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో, శాంపిల్స్‌ సేకరించి పూణేలోని ల్యాబ్‌కు టెస్ట్‌ కోసం పంపినట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఇక, చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. దఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్‌ అయ్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now