New Zealand Hostel Fire: హాస్టల్‌లో అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం, 10 మంది మంటల్లో సజీవ దహనం, 52 మందికి కాపాడిన అధికారులు

న్యూజిలాండ్ వెల్లింగ్‌టన్‌లో ఓ నాలుగు అంతస్తుల హాస్టల్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు భవనమంతా వ్యాపించి భయానక పరిస్థితి నెలకొంది. మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

New Zealand Hostel Fire (Photo Credit- Twitter/@ANI)

న్యూజిలాండ్ వెల్లింగ్‌టన్‌లో ఓ నాలుగు అంతస్తుల హాస్టల్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు భవనమంతా వ్యాపించి భయానక పరిస్థితి నెలకొంది. మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

హాస్టల్‌లో మొత్తం 92 మంది ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే భయంతో వీరంతా బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు 52 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement