Hana-Rawhiti Maipi-Clarke: వీడియో ఇదిగో, పార్లమెంట్‌లో 21 ఏళ్ల మహిళా ఎంపీ ప్రసంగానికి ఆశ్చర్యపోయిన మిగతా ఎంపీలు, షాకై ఆమెను అలాగే చూస్తుండిపోయిన సభ్యులు

న్యూజిలాండ్‌లోని ఓ పార్లమెంటు సభ్యురాలు చేసిన శక్తివంతమైన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం 21 సంవత్సరాలు వయసు గల హనా-రౌహితీ మైపి-క్లార్క్ అనే యువ ఎంపీ గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది.

New Zealand Politician Hana-Rawhiti Maipi-Clarke Powerful Speech Goes Viral

న్యూజిలాండ్‌లోని ఓ పార్లమెంటు సభ్యురాలు చేసిన శక్తివంతమైన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం 21 సంవత్సరాలు వయసు గల హనా-రౌహితీ మైపి-క్లార్క్ అనే యువ ఎంపీ గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది. గత నెలలో ఉద్వేగభరితమైన ప్రసంగంలో మైపి-క్లార్క్ సాంప్రదాయ 'హాకా' లేదా 'యుద్ధం' ప్రదర్శించారు.

ఇది మావోరీ హాకా అనే సాంస్కృతిక ప్రదర్శన. హాకా యొక్క సాంప్రదాయ మావోరీ ప్రదర్శన న్యూజిలాండ్ వాసులందరికీ గర్వకారణం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతుంది, ఆల్ బ్లాక్స్,  న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ ద్వారా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆమెస్పీచ్ సందర్భంగా  ఓటర్లకు వాగ్దానం చేశారు. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం, "నేను మీ కోసం చనిపోతాను ... అలాగే నేను మీ కోసం జీవిస్తాను" అని ఆమె చెప్పింది.

170 ఏళ్లలో న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ. 2008 నుండి హౌరాకి వైకాటో సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. తనను తాను రాజకీయ నాయకురాలిగా చూడడం లేదని, మావోరీ భాష యొక్క సంరక్షకురాలిగా మావోరీ యొక్క కొత్త జనరేషన్ యొక్క స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని నమ్ముతున్నానని చెప్పింది.మైపీ-క్లార్క్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 20,000 మంది, టిక్‌టాక్‌లో మరో 18,500 మంది ఫాలోవర్లు ఉన్నారు.

Here's Her Speech Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement