Earthquake in North Atlantic Ocean: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 6.4 తీవ్రతతో భారీ భూకంపం, బార్బుడాలో కూడా భారీ భూకంపం
సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. దీంతో పాటు ఆంటిగ్వా (Antigua), బార్బుడాలో (Barbuda) కూడా భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.28 గంటలకు భూమి కంపించిందని యూఎస్‌జీఎస్ తెలిపింది. దీని తీవ్రత 6.6గా నమోదయిందని, కాడ్రింగ్టన్‌కు (Codrington) 274 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)