North Korea: జపాన్‌కు చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా, జగాంగ్ ప్రావిన్స్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన అధ్యక్షుడు కిమ్ జొంగ్–ఉన్
తాజాగా మంగళవారం జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్ ప్రావిన్స్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఓ ప్రకటనలో తెలిపారు.
నార్త్ కొరియా జపాన్ కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా మంగళవారం జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్ ప్రావిన్స్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఓ ప్రకటనలో తెలిపారు. జపాన్ కోస్ట్‌గార్డ్ సైతం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని జపాన్ ప్రభుత్వం సూచనలిచ్చింది. పలు ప్రాంతాల్లో ట్రైన్ సర్వీస్‌లను ఆపేశారు.
క్షిపణి ప్రయోగాన్ని జపాన్ ప్రధాని కిషిదా ఖండించారు. ఉత్తర కొరియా నుండి పదే పదే క్షిపణి ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో జపాన్ తమ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతోపాటు, ఎదురుడాడి చేసే మార్గాలను పరిశీలిస్తుందని రక్షణమంత్రి యసుకాజు హమాడా చెప్పారు. 2017 తర్వాత జపాన్ భూభాగంపైకి క్షిపణిని పంపడం ఇదే మొదటిసారి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)