North Korea: కిమ్‌ రాజ్యంలో అంతుచిక్కన అంటువ్యాధి, ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న నార్త్ కొరియా, దేశంలో కొత్తగా 26,010 మందికి కరోనా

ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా గుర్తించారు.

North Korean leader Kim Jong Un. File photo

కరోనా వైరస్ విజృంభణతో అల్లాడిపోతున్నఉత్తరకొరియాలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రోగులకు అవసరమైన మందులను అందిస్తున్నారని జాతీయ అధికార మీడియా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. అయితే ఈ వ్యాధిబారిన ఎంతమందిపడ్డారు, అది ఎలాంటి వ్యాధి అనే విషయాలను మాత్రం వెల్లడిచింది. కాగా, దేశంలో కొత్తగా 26,010 మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని పేర్కొన్నది. దీంతో దేశంలో జ్వర సంబంధిత కేసులు 40 లక్షల 56 వేలకు చేరాయి. ఇప్పటివరకు దేశంలో 76 కరోనా కేసులు నమోదయ్యాయి.