Horrific Video: వైజ్ సిటీ గేమ్ తరహాలో కార్లపై బుల్లెట్ల వర్షం.. వైరల్ అవుతున్న భయానక వీడియో

వైజ్ సిటీ గేమ్ తరహాలో రోడ్డుపై వెళుతున్న కార్లపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత బట్టలన్నీ విప్పేసి నగ్నంగా తిరగడం మొదలుపెట్టాడు.

Credit: twitter

నడిరోడ్డుపై ఓ సైకో వీరంగం సృష్టించాడు. వైజ్ సిటీ గేమ్ తరహాలో రోడ్డుపై వెళుతున్న కార్లపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత బట్టలన్నీ విప్పేసి నగ్నంగా తిరగడం మొదలుపెట్టాడు. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భయభ్రాంతులకు గురిచేసే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాలిఫోర్నియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 39 ఏళ్ల జూలియో రోడార్టే అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని శాన్‌జసింటో ప్రాంతంలో నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 6 గంటల 30 నిముషాల (అమెరికా కాలమానం ప్రకారం) సమయంలో దగ్గరలోని వెస్ట్ సెవెన్త్ స్ట్రీట్‌‌కి చేరుకున్న రొడార్డే.. తనతో తెచ్చుకున్న తుపాకీతో రోడ్డుపై వెళుతున్న కార్లపై విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  వీడియో ఇదిగో, వేగంగా వెళ్తున్న రైలుతో సెల్ఫీ, పట్టాల కింద పడి నుజ్జు నుజ్జు అయిన యువతి

కాగా.. తనతో తెచ్చుకున్న బులెట్ మ్యాగజీన్లన్నీ అయిపోయిన తర్వాత తుపాకీ పారేసి నడిరోడ్డుపైనే బట్టలు విప్పి నగ్నంగా తిరగడం మొదలుపెట్టాడు. సమాచారం అందింన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రోడార్టేని అరెస్ట్ చేసి అతడిపై మర్డర్ చార్జ్‌తో పాటు అటెంప్ట్ టూ మర్డర్ కేస్ కూడా నమోదు చేశారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)