Pakistan Mosque Blast: పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి, 83కి పెరిగిన మృతుల సంఖ్య, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో తాలిబన్‌లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Pakistan Suicide Blast. (Photo Credits: Twitter@AnasMallick)

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో తాలిబన్‌లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెషావర్‌ నగరంలో గల హై సెక్యూరిటీ జోన్‌లో ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. సోమవారం మ‌ధ్యాహ్నం ప్రార్థన‌ల స‌మ‌యంలో ఈ పేలుడు సంభవించింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement