Pervez Musharraf Death Hoax: పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందారా.., సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో దుబాయ్‌లో ఒక ఆస్పత్రిలో చేరిన ఆయన్ను.. పలుమార్లు వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముషారఫ్ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో దుబాయ్‌లో ఒక ఆస్పత్రిలో చేరిన ఆయన్ను.. పలుమార్లు వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముషారఫ్ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 78 ఏళ్ల ముషారఫ్.. 1999 అక్టోబర్‌లో సైనిక చర్య ద్వారా పాక్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పర్వేజ్ అధికారం కోల్పోయిన తర్వాత దుబాయ్ వెళ్లి.. అక్కడే నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అవినీతి ఆరోపణలు, దేశద్రోహం కేసులు ఎదుర్కొన్నారు. చాలా కాలంగా ఆయన అమిలోడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. దీనివల్ల కనీసం నిలబడే స్థితిలో కూడా ముషారఫ్ లేనట్లు వైద్యులు తెలిపారు. 2007 నవంబర్ 3న పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్.. రాజ్యాంగాన్ని రద్దు చేశారు. దీనిపై 2016 మార్చి 31న ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇదే సమయంలో మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం అని చెప్పి పాక్ విడిచి వెళ్లిన ఆయన.. దుబాయ్ వెళ్లి మళ్లీ తిరిగి పాక్ రాలేదు. తాజాగా ఆయన మరణించారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని మరికొంతమంది ఖండిస్తున్నారు. ఆయన కండీషన్ సీరియస్ గా ఉందని అయితే ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని వారు చెబుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)