Grand Cross of the Legion of Honour: ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్ బహుకరించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతుల మీదుగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను అందుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది
భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతుల మీదుగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను అందుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. నేడు జరగనున్న ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఫ్రాన్స్ పురస్కారాన్ని అందుకుంటున్న మోదీ ఫొటోలను విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. పురస్కారం అందుకున్న అనంతరం మోదీ మాట్లాడుతూ భారత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపినట్టు బాగ్చి పేర్కొన్నారు. అంతకుముందు మాక్రాన్, ఆయన భార్య, ప్రథమ పౌరురాలు బ్రిగెట్టి మాక్రాన్ మోదీకి ప్రత్యేక విందు ఇచ్చారు.
Here's Photos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)