PM Modi in USA: భారత ప్రధాని అమెరికా టూర్, తొలి రోజు గ్లోబల్ కంపెనీల సీఈఓలతో చర్చ; రేపు వైట్‌హౌజ్‌లో మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్న యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్

Narendra-Modi US Tour 2021 | PTI Photo

మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ఈరోజు వాషింగ్టన్ డీసీలో ప్ర‌ముఖ కంపెనీల‌ సీఈఓలతో సమావేశం కానున్నారు. క్వాల్ కామ్, అడోబ్, బ్లాక్ స్టోన్, జనరల్ అటామిక్స్, ఫస్ట్ సోలార్ కంపెనీల అధిపతులు ప్రధానమంత్రితో స‌మావేశ‌మ‌వుతారు. అలాగే మోదీ తన పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌‌ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేపు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీకి వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘానిస్థాన్‌లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం, ఇండో-పసిఫిక్‌, వాతావరణ మార్పులు వంటి అంశాలపై బైడెన్‌తో మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement