Shehbaz Sharif: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్, ఓటింగ్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైన పీఎంఎల్-ఎన్ నేత, పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో గద్దె దిగిన ప్రధాని
ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ నేత అయిన 70 ఏళ్ల షెహబాజ్.. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. ప్రధాని ఎన్నిక కోసం.. సోమవారం నేషనల్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.
పాకిస్థాన్ కొత్త ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ నేత అయిన 70 ఏళ్ల షెహబాజ్.. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. ప్రధాని ఎన్నిక కోసం.. సోమవారం నేషనల్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. గత అధికార పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యుల రాజీనామాతో ఏర్పడిన ప్రతిష్టంబనను తొలగించేందుకు ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్‌లో షెహబాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పాక్ ప్రధాని రేసు కోసం పీటీఐ నుంచి షా మహమ్మద్ ఖురేషీ, షెహబాజ్ షరీఫ్ ఇద్దరూ పోటీపడ్డారు. అయితే పీటీఐ సభ్యుల మూకుమ్మడి రాజీనామాతో ప్రభుత్వం కుప్పకూలగా.. ఖురేషీ అభ్యర్థిత్వానికి బలం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. షెహబాజ్ షరీఫ్ 2018లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా.. ఒక ప్రధానిని అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. 174 ఓట్లతో ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి దింపేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)