Sheikh Khalifa Bin Zayed Al Nahyan Dies: యుఎఈ అధ్యక్షుడు కన్నుమూత, అనారోగ్యంతో మరణించిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సంతాపం తెలిపిన పలు దేశాల ప్రముఖులు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందారు. 73 ఏళ్ల అబుదాబి పాలకుడు షేక్‌ ఖలీఫా.. శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్‌ ఖలీఫా 2014, నవంబర్‌ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Sheikh Khalifa bin Zayed Al Nahyan

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందారు. 73 ఏళ్ల అబుదాబి పాలకుడు షేక్‌ ఖలీఫా.. శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్‌ ఖలీఫా 2014, నవంబర్‌ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ నుంచి వారసత్వంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1948లో పుట్టిన షేక్‌ ఖలీపా.. యూఏఈకి రెండో అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు. అయితే ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. చాలాకాలంగా ఆయన అనారోగ్యంతో ఉండడంతో అదే కారణమని తెలుస్తోంది.

షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. యూఏఈ అధ్యక్షుడి మృతికి సంతాపంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడు రోజులపాటు పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాలు పూర్తిగా బంద్‌ పాటించనున్నాయి. గతంలో స్ట్రోక్‌బారిన పడిన ఆయన.. 2014 నుండి బయట కనిపించడం చాలా అరుదుగా జరిగింది. అయినప్పటికీ ఆయన తీర్పులు, కీలక చట్టాలు చేయడం కొనసాగించారు.ఆయన సోదరుడు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఈ మధ్యకాలంలో పరిపాలనలో చురుకుగా ఉంటూ వస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now