Severe Turbulence on Boeing 777 Flight: పెనుగాలులకు ఊగిపోయిన సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం, ఒకరు మృతి, మరో 30 మందికి గాయాలు

సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం లండన్ నుంచి సింగపూర్ వెళుతుండగా తీవ్ర కుదుపులకు లోనయింది. ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఎయిర్ టర్బులెన్స్ కు గురైన ఈ బోయింగ్ విమానాన్ని థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు

Singapore Airlines Boeing 777 Flight Experiences Severe Turbulence; One Passenger Dead, Over 30 Injured

సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం లండన్ నుంచి సింగపూర్ వెళుతుండగా తీవ్ర కుదుపులకు లోనయింది. ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఎయిర్ టర్బులెన్స్ కు గురైన ఈ బోయింగ్ విమానాన్ని థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన ప్రయాణికుడి కుటుంబానికి సింగపూర్ ఎయిర్ లైన్స్ సంతాపం తెలియజేసింది.   వీడియో ఇదిగో, ఆకాశం నుంచి భారీ వెలుగులు విరజిమ్ముతూ రాలిపడిన ఉల్క, పట్టపగలును తలపించిన అర్థరాత్రి

విమానాలు గాల్లోకి లేచాక, గరిష్ఠ ఎత్తుకు చేరిన తర్వాత, వాయు పీడనాల్లో మార్పు కారణంగా తీవ్రమైన కుదుపులకు గురవుతాయి. దీన్నే ఎయిర్ టర్బులెన్స్ అంటారు. వాతావరణ మార్పుల కారణంగా గాలి ప్రవాహం ఒక్కసారిగా దిశను మార్చుకుంటుంది. భిన్న దిశల నుంచి వీచే పెనుగాలులకు విమానం తీవ్రంగా ఊగిపోతుంది. ఈ కుదుపులు ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు కొనసాగుతాయి.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement