Sri Lanka Crisis: శ్రీలంక తాత్కాలిక అద్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే, రాజ్యాంగంలోని 37(1) నిబంధన కింద నియమించామని తెలిపిన స్పీకర్
ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి వెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి విదితమే. అయితే రాజపక్స ఇంతవరకూ తన పదవికి రాజీనామా చేయలేదు.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీకర్ మహింద యప అబెవర్ధన బుధవారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి వెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి విదితమే. అయితే రాజపక్స ఇంతవరకూ తన పదవికి రాజీనామా చేయలేదు. మరోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధన కింద రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించామని స్పీకర్ వెల్లడించారు.