Tanzania Floods: భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చరియలు, 47 మంది మృతి, మరో 85 మందికి తీవ్ర గాయాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్రికా ( East African) దేశమైన టాంజానియా (Tanzania) విలవిలలాడుతోంది. శనివారం ఉత్తర టాంజానియాలో కురిసిన వర్షానికి వరదలు (Flooding) సంభవించాయి. రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటేష్‌ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది.

Tanzania Floods (photo-Video Grab)

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్రికా ( East African) దేశమైన టాంజానియా (Tanzania) విలవిలలాడుతోంది. శనివారం ఉత్తర టాంజానియాలో కురిసిన వర్షానికి వరదలు (Flooding) సంభవించాయి. రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటేష్‌ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా సంభవించిన వరదల ధాటికి కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో సుమారు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాప్‌28 పర్యావరణ సదస్సు కోసం ప్రస్తుతం దుబయ్ పర్యటనలో ఉన్న టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హస్సన్ ప్రజలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement