Tito Jackson Dies: కారులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన మైఖేల్ జాక్సన్ సోదరుడు
తమ ప్రియమైన తండ్రి రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ టిటో జాక్సన్ ఇప్పుడు తమతో లేరని తాము బరువెక్కిని హృదయాలతో తెలియజేస్తున్నామని ఆయన కుమారులు టీజే, తాజ్, టారిల్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. ఆయన తామందరి గురించి, శ్రేయస్సు గురించి పట్టించుకునే అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.
మైఖేల్ జాక్సన్ 9 మంది సోదరుల్లో ఒకరైన టిటో జాక్సన్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. జాక్సన్ సోదరుల్లో టిటో మూడో వాడు. ‘జాక్సన్ 5’ టీంలో ఒకరు. తమ ప్రియమైన తండ్రి రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ టిటో జాక్సన్ ఇప్పుడు తమతో లేరని తాము బరువెక్కిని హృదయాలతో తెలియజేస్తున్నామని ఆయన కుమారులు టీజే, తాజ్, టారిల్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. ఆయన తామందరి గురించి, శ్రేయస్సు గురించి పట్టించుకునే అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.
టిటో జాక్సన్ మరణాన్ని తొలుత ‘ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్’ నివేదించింది. ఆయన మరణానికి కారణం తెలియనప్పటికీ గుండెపోటుతోనే ఆయన మరణించినట్టు పేర్కొంది. న్యూ మెక్సికో నుంచి ఒక్లహోమాకు కారులో వెళ్తుండగా ఆయన గుండెపోటుకు గురైనట్టు జాక్సన్ కుటుంబ మాజీ మేనేజర్ మానింగ్ తెలిపారు.
Here's ANI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)