Toshakhana Case: సైఫర్ కేసు మరవక ముందే మరో కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి షాక్, తోషాకానా కేసులో పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్యకు 14 ఏళ్లు జైలు శిక్ష
తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు నిన్న సైఫర్ కేసులో 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన సంఘటన మరువక ముందే మరో షాక్ తగిలింది. తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.ఆ జంట సుమారు రూ.1.5 బిలియన్లు జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదు అని కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు కూడా విధించింది.ఫిబ్రవరి 8వ తేదీన పాక్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు 8 రోజుల ముందే ఈ తీర్పు రావడం విశేషం.
Here's News