Turkey Earthquake: టర్కీని వణికించిన భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు, ఇండ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం, వీడియో ఇదిగో..
టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావానికి వణికిపోయాయి.
టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావానికి వణికిపోయాయి. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి.జనం ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఇప్పటివరకు 22 మంది గాయపడినట్లు తెలుస్తున్నది. పశ్చిమ టర్కీలో గత మూడు నెలల్లో ఇది రెండో అతిపెద్ద భూకంపం అని చెప్పవచ్చు. 2023లో టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ధాటికి 59 వేల మంది మరణించారు. కోటాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.
Turkey Earthquake Video