Turkey Earthquake: వీడియో..టర్కీ భూకంపంలో చావును జయించిన పిల్లి కూన, శిథిలాల కింద తిండి లేక రోజంతా నరకయాతన, రెస్కూ ఆపరేషన్ ద్వారా రక్షించిన అధికారులు

భవన శిథిలాల నుంచి పిల్లిని బయటికి తీసిన వీడియోను ఆమీ షావ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఇంటర్నెట్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Turkey Earthquake. (Photo Credits: Twitter@DDNewslive)

టర్కీ, సిరియా సరిహద్దుల్లో సంభవించిన వరుస భూకంపాలు విలయాన్ని సృష్టించిన సంగతి విదితమే. కాగా శిధిలాలను తొలగించే పనిలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న సిబ్బందికి ఓ భవనం శిథిలాల కింద నుంచి పిల్లికూన శబ్దం వినిపించింది. దాంతో శ్రద్ధగా పరిశీలించి ఆ శబ్దం ఒక పెద్ద లోహపు మూత కింద నుంచి వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ మూత కింద ఒకవైపు శిథిలాలను తొలగించి రంధ్రం చేశారు. అది గమనించిన పిల్లికూన వెంటనే ఆ రంధ్రంలోంచి బయటకి వచ్చింది.

అయితే ఒక రోజంతా తిండి లేకపోవడం, చుట్టూ ముసుకుపోయిన ప్రదేశంలో ఇరుక్కుని గాలి సరిగా ఆడకపోవడంతో ఆ పిల్లి బాగా నీరసించిపోయి కనిపించింది. భవన శిథిలాల నుంచి పిల్లిని బయటికి తీసిన వీడియోను ఆమీ షావ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఇంటర్నెట్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Here's Video