King Charles III Diagnosed With ’Cancer': బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్, కీలక ప్రకటన చేసిన బకింగ్‌హం ప్యాలెస్‌

ఈ క్రమంలోనే ఛార్లెస్‌-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్‌ వివరించింది. అయితే, అది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు

King Charles III. (Photo credits: Instagram)

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్‌-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్‌ వివరించింది. అయితే, అది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీంతో, కింగ్‌ ఛార్టెస్‌ సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్‌ వివరించింది. కాగా, క్యాన్సర్‌కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022 సెప్టెంబరు​లో తన తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్​-3 బ్రిటన్​ రాజుగా ఎన్నికయ్యారు.

Here's News