ISRO Proba 3 Mission Launched Successfully (Photo Credits: X/@ANI)

New Delhi, DEC 05: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-59 (PSLV C 59) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 550 కిలోల రెండు ప్రోబా-3 (Proba 3 Mission) శాటిలైట్లతో PSLV C-59 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-59 నింగిలోకి మోసుకెళ్లింది. ప్రోబా-3 ఉపగ్రహాలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినవి. ఈ ప్రోబా-3 శాటిలైట్లు సూర్యుడి చుట్టూ బయటి వలయమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి. కృతిమ సూర్యగ్రహణాలను సృష్టించి కరోనాను శోధించడం ప్రోబా-3 ప్రత్యేకత. కరోనా పరిశీలనతో ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా-3 ఉపగ్రహాలను రూపొందించారు.

ISRO Proba 3 Mission Launched Successfully

 

నిన్న సాయంత్రం నిర్వహించాల్సిన పీఎస్ఎల్వీ సీ59 ప్రయోగం.. ఇవాళ్టికి వాయిదా పడింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ లో నిన్న సాంకేతిక లోపం తలెత్తగా ప్రయోగం క్యాన్సిల్ అయ్యింది. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన ఇస్రో.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది. ఇదొక కమర్షియల్ మిషన్. రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది ఇస్రో. పీఎస్ ఎల్వీ రాకెట్ల ద్వారా ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.