Texas Migrant Deaths: అమెరికాలో ఘోర విషాదం, ట్రక్కులో వెళ్తున్న 46 మం​ది మృతి, వారిలో నలుగురు చిన్నారులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 16 మంది..

అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శాన్‌ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న46 మం​ది మృతిచెందారు. ఈ మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తెలిపారు. శాన్‌ ఆంటోనియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

US Police. (Photo Credits: Wikimedia Commons)

అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శాన్‌ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న46 మం​ది మృతిచెందారు. ఈ మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తెలిపారు. శాన్‌ ఆంటోనియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కు డోర్‌ను తెరిచిచూడగా.. అందులో దాదాపు 46 మంది చనిపోయి ఉన్నారు. 16 మంది ప్రాణాలతో బయట పడ్డారని.. వారిలో నలుగురు చిన్నారుల ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు టెంపరేచర్‌ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సాధారణంగా మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement