Cough Syrup Deaths Row: దగ్గు మందు కారణంగా 300 మంది చిన్నారులు మృతి, దగ్గు మందులో విషపూరిత రసాయనాలు కారణం, ఆ మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన WHO
ఇండోనేషియా, ఉబ్జెకిస్తాన్‌లో ఐదేళ్లపు చిన్నారులు దాదాపు 300 మందికిపైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటనలో పేర్కొంది.
ఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇండోనేషియా, ఉబ్జెకిస్తాన్‌లో ఐదేళ్లపు చిన్నారులు దాదాపు 300 మందికిపైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటనలో పేర్కొంది. కొన్ని దగ్గు సిరప్‌లలో డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించామని, వాటి కారణంగా పిల్లల్లో కిడ్నీలు దెబ్బతింటాయని తేలిందని WHO పేర్కొంది. డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ విషపూరిత రసాయనాలు.. ప్రాణాంతకమని, వాటిని ఔషధాల్లో ఉండకూడదని చెబుతున్నది.
ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ 194 సభ్య దేశాలకు.. కలుషితమైన మందులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.మార్కెట్‌లో లభ్యమయ్యే అన్ని వైద్య ఉత్పత్తులు తప్పనిసరిగా సమర్థ అధికారం ద్వారా ఆమోదించాలని, అధీకృత లైసెన్స్ కూడా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. సభ్యదేశాలన్నీ తమ తమ దేశాల్లోని ఔషధాల తయారీ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పరీక్షలు జరిపేందుకు నిబంధనలను రూపొందించాలని చెప్పింది.
Here's Reuters tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)