Asia Cup 2022: కోహ్లి పరుగుల వరద.. టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు.. ఆఫ్ఘాన్ పై భారత్ విజయ దుందుభి
సూపర్-4లోని ఆఖరి పోరులో ఆఫ్ఘనిస్తాన్ పై 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొంతకాలంగా ఫాంలో లేని విరాట్.. ఈ మ్యాచ్ లో తన సత్తా చాటాడు. 61 బంతుల్లో 122 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు.
Dubai, September 9: ఆసియా కప్ ను భారత్ విజయంతో ముగించింది. సూపర్-4లోని ఆఖరి పోరులో ఆఫ్ఘనిస్తాన్ పై 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొంతకాలంగా ఫాంలో లేని విరాట్.. ఈ మ్యాచ్ లో తన సత్తా చాటాడు. 61 బంతుల్లో 122 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టోర్నీలో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.
తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులను మాత్రమే చేసింది. దీంతో విజయగర్వంతో భారత్ సిరీస్ నుంచి నిష్క్రమించింది.