Disney Hot star: జియో దెబ్బకు దిగొచ్చిన హాట్‌స్టార్, క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే, భారత్‌లో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఫ్రీగా లైవ్ చూడొచ్చని హాట్‌స్టార్ ప్రకటన
ఇక నుంచి భారత్ లో జరిగే అన్ని క్రికెట్ టోర్నమెంట్లపై మొబైల్ ఫోన్లలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం (Streaming) చేయనున్నది. క్రికెట్ పట్ల క్రేజ్ ఉన్న భారతీయుల మనస్సు చూరగొనేందుకు ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌లో రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్నది.
Mumbai, June 09: జియో సినిమా బాటలో వాల్ట్‌డిస్నీ కో హాట్‌స్టార్ ప్రయాణిస్తున్నది. ఇక నుంచి భారత్ లో జరిగే అన్ని క్రికెట్ టోర్నమెంట్లపై మొబైల్ ఫోన్లలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం (Streaming) చేయనున్నది. క్రికెట్ పట్ల క్రేజ్ ఉన్న భారతీయుల మనస్సు చూరగొనేందుకు ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌లో రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయ స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఐపీఎల్ నిలిచింది. హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్ ఇంటర్నెట్ ప్రసార హక్కులను జియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ టోర్నీ జరిగిన ఐదు వారాల్లో రికార్డు స్థాయిలో జియో సినిమా 1300 కోట్ల డిజిటల్ వీక్షకులను సొంతం చేసుకున్నది. ప్రతి వీక్షకుడు ప్రతి మ్యాచ్ సగటున గంట సేపు వీక్షించాడని తెలుస్తున్నది. ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోయిన హాట్ స్టార్..2023 సీజన్‌లో 50 లక్షల మంది వీక్షకులను కోల్పోయిందని రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా వేసింది.
MS Dhoni As Footballer? పాఠ్య పుస్తకంలో పుట్‌బాల్ ఆటగాడిగా ఎంఎస్ ధోని, వైరల్ అవుతున్న పిక్ ఇదిగో..
ఈ నేపథ్యంలో ఆసియా కప్, ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లపై ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని హాట్ స్టార్ శుక్రవారం వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కంటెంట్ వీక్షకుల నుంచి చార్జీలు వసూలు చేసేందుకు ఇదిలా ఉంటే జియో సినిమా సిద్ధమైంది. అయినా, ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగానే అందిస్తామని జియో సినిమా ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.