RCB Vs RR: చివరి ఓవర్ వరకు ఉత్కంఠ, సొంతగడ్డపై దుమ్మురేపిన ఆర్సీబీ, రాజస్థాన్ వెన్నువిరిసిన బెంగళూరు బౌలర్లు
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ (Rajasthan Royals) ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది.
Bengalore, April 23: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ (Rajasthan Royals) ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (47)(Yashswi), దేవదత్ పడిక్కల్ (52) ధ్రువ్ జురెల్ (33) రాణించినా మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సిరాజ్, డేవిడ్ విల్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు. మ్యాక్స్‌వెల్ (77), డు ప్లెసిస్ (62) మెరుపులు మెరిపించడంతో తొలుత బెంగళూరు భారీ స్కోరు సాధించింది.
ఒకానొక దశలో ఆర్సీబీ సులువుగా 220 స్కోరు సాధించేలా కనిపించింది. కానీ, మ్యాక్స్‌వెల్, ప్లెసిస్ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో బెంగళూరు ఇన్నింగ్స్ గాడితప్పింది. చివరి ఏడు ఓవర్లలో ఆర్సీబీ.. 7 వికెట్లు కోల్పోయి 54 పరుగులే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.