ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్న ఇండియా, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్, మూడవ స్థానంలో న్యూజీలాండ్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) నంబర్ త్రి నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్‌లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Indian bowlers restricted England to 188 to register a 36-run win. (Photo Credits: Twitter@BCCI)

Amaravati, Mar 29: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న కోహ్లీ టీం.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) నంబర్ త్రి నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్‌లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్‌ (England) 121 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని (England still No. 1 in ICC Rankings) నిలబెట్టుకుంది.

వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి సేన.. న్యూజిలాండ్‌(118)ను (New Zealand) మూడో స్థానానికి నెట్టి 119 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసిన న్యూజిలాండ్‌ 118 పాయింట్లకు మాత్రమే పరిమితమై మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ జాబితాలో 111 రేటింగ్‌ పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో, 108 పాయింట్లతో ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు నిలిచాయి.

ఉత్కంఠభరితమైన చివరి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా, 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం, భారత పర్యటనలో ఒక్క సిరీస్ కూడా నెగ్గకుండా ఇంగ్లండ్ వైట్ వాష్; ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభం

కాగా, భారత్‌ ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీని సాధించి ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో చివరిదాకా పోరాడి భారత శిబిరంలో గుబులు పుట్టించిన ఇంగ్లాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కైవసం చేసుకోగా, వరుస అర్ధసెంచరీలతో అలరించిన ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జానీ బెయిర్‌ స్టోకు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది