ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీలో కోహ్లీదే రికార్డు, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లు, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ గెలుచుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో..

కాగా ఐసీసీ 2007లో తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్ర‌వేశపెట్టింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ(MS Dhoni) సార‌థ్యంలోని టీమిండియా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను మ‌ట్టిక‌రిపించి చాంపియ‌న్‌గా అవ‌త‌రింది.

ICC T20 WORLD CUP 2024: Full list of all Player of the Tournament winners in World Cup

ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్(T20 World Cup 2024) 9వ సీజ‌న్ అమెరికా గ‌డ్డ‌పై జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. కాగా ఐసీసీ 2007లో తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్ర‌వేశపెట్టింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ(MS Dhoni) సార‌థ్యంలోని టీమిండియా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను మ‌ట్టిక‌రిపించి చాంపియ‌న్‌గా అవ‌త‌రింది. ఆ ఎడిష‌న్‌లో పాక్ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ ఆఫ్రిది(Shaheed Afridi) ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ’గా ఎంపిక‌య్యాడు. 2009లో తిల‌క‌రత్నే దిల్షాన్(శ్రీలంక‌), 2010 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కెవిన్ పీట‌ర్స‌న్‌(ఇంగ్లండ్) ఈ అవార్డును అందుకున్నారు.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్స‌న్ 2012లో విజేత‌గా నిల‌వ‌గా.. 2014, 2016లో భార‌త ఆట‌గాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) టాప్ స్కోర్‌తో రికార్డు నెల‌కొల్పాడు. 2021లో ఆసీస్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్. 2022లో సామ్ క‌ర‌న్‌లు ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును త‌న్నుకుపోయారు. రూమ‌ర్స్ కు చెక్ పెట్టిన విరాట్ కోహ్లీ, ఎట్ట‌కేల‌కు ముంబై నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కిన స్టార్ బ్యాట్స్ మెన్, వార్మ‌ప్ మ్యాచ్ లో ఆడ‌తాడా? లేదా? అన్న‌ది అనుమానమే

తొలి ఎడిష‌న్‌లో పాక్  స్పీడ్‌స్ట‌ర్ ఉమ‌ర్ గుల్(Umar Gul) నిప్పులు చెరిగాడు. 13 వికెట్లు తీసిన గుల్ 2009లోనూ బెంబేలెత్తించాడు. ఈసారి ఈ పేస‌ర్ మ‌ళ్లీ 13 వికెట్ల‌తో మెరిశాడు. 2010 ఎడిష‌న్‌లో ఆసీస్ ఫాస్ట్ బౌల‌ర్ నాన్సీ డిర్క్ నేన్స్ 14 వికెట్ల‌తో రికార్డు నెల‌కొల్పాడు. ఇక 2012 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అయితే.. శ్రీ‌లంక మిస్ట‌రీ స్పిన్న‌ర్ అజంతా మెండిస్(Ajanta Mendis) 15 వికెట్ల‌తో చ‌రిత్ర సృష్టించాడు.

Here's ICC Tweet

2014 ఎడిష‌న్‌లో స‌ఫారీ లెగ్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహిర్, అహ‌స‌న్ మాలిక్‌లు 12 వికెట్ల‌తో టాప్‌లో నిలిచారు. అఫ్గ‌నిస్థాన్ స్పిన్న‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీ 2016లో 12 వికెట్ల‌తో విజృంభించాడు. 2021, 2022 ఎడిష‌న్‌లో శ్రీ‌లంక ఆల్‌రౌండర్ వ‌నిందు హ‌స‌రంగ(Wanindu Hasaranga) తిప్పేశాడు. రెండు సీజ‌న్ల‌లో 16, 15 వికెట్లు ప‌డ‌గొట్టాడు.