ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌, విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన రిషబ్ పంత్, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్

కాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

Rishab Panth

రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌కు విజయవంతమైన పునరాగమనం మరింత జోష్ లోకి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చాలానెలలపాటు ఆటకు దూరమైన అతడు పునరాగమనంలోనూ అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్టార్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని దాటేశాడు పంతం. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

తాజాగా పంత్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు దిగజారి శ్రీలంక బ్యాటర్ కరుణరత్నెతో కలిసి 15వ స్థానాన్ని పంచుకుంటున్నాడు. శుభ్‌మన్ గిల్‌ నాలుగు స్థానాలు దిగజారి 19వ స్థానానికి పడిపోయాడు.

వీడియో ఇదిగో, రిషబ్ పంత్ సిక్స్ కొడితే స్టేడియం పైకప్పు మీద పడింది, ఏకంగా 107 మీటర్లు సిక్స్ బాదిన భారత స్టార్

ఇక బెంగళూరులో టెస్టులో భారత్‌పై శతకం బాదిన న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి దూసుకొచ్చాడు. ఇదే మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసిన డేవాన్ కాన్వే 12 స్థానాలు మెరుగై 36వ స్థానం దక్కించుకున్నాడు. టీమ్‌ఇండియాపై మొదటి టెస్టులో ఎనిమిది వికెట్లు పడగొట్టిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ రెండు స్థానాలు మెరుగై తొమ్మిదో స్థానంలో నిలిచి కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నాడు. బ్యాటర్ల జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్, బౌలర్ల జాబితాలో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.



సంబంధిత వార్తలు