IND vs AUS 1st Test 2024: పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారీ గెలుపు, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి భారత్, రెండో స్థానానికి కంగారూలు

టీమిండియా టాప్‌ ప్లేస్‌కు చేరడంతో అప్పటివరకు టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి దిగజారింది. ఇక పెర్త్‌లోని ఆప్టస్‌ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.

Jasprit Bumrah Leads India to Its Biggest Test Win on Australian Soil

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన‌ తొలి టెస్టులో భార‌త జ‌ట్టు చారిత్మాత్మక విజయం సాధించింది. 534 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 238 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో టీమిండియా 295 ర‌న్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ మొత్తంలో ఎనిమిది వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ను భారత్‌ గెలుపుతో ప్రారంభించింది.

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 12/3తో నాలుగో రోజు ఆట కొన‌సాగించిన ఆసీస్ మ‌రో ఐదు ప‌రుగులు జోడించి ఉస్మాన్ ఖ‌వాజా వికెట్‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్ ద్వ‌యం ఐదో వికెట్‌కు ఈ జోడి 62 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించింది. అయితే, మ‌హ్మ‌ద్‌ సిరాజ్ ఓ అద్భుత‌మైన బంతితో స్మిత్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్ర‌మంలోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాత‌ మిచెల్ మార్ష్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రిగెత్తించాడు.

89 ప‌రుగులు చేసి సెంచ‌రీ వైపు దూసుకెళ్తున్న హెడ్‌ను బుమ్రా పెవిలియ‌న్‌కు పంపాడు. దీంతో మార్ష్‌, హెడ్ నెల‌కొల్పిన 82 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. అనంత‌రం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) వికెట్లను కోల్పోవ‌డంతో ఆసీస్ ఓట‌మి ఖాయ‌మైంది. చివ‌రికి ఆతిథ్య జ‌ట్టు 58.4 ఓవ‌ర్ల‌లో 238 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

టీమిండియా విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, పెర్త్ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు

భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే వాషింగ్ట‌న్ సుంద‌ర్ 2, హ‌ర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి 8 వికెట్లతో (మొద‌టి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3) రాణించిన కెప్టెన్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా, ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త్ 0-1తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్టు వ‌చ్చే నెల 6 నుంచి 10వ తేదీ మ‌ధ్య అడిలైడ్‌లో జ‌ర‌గ‌నుంది.

పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై గెలుపుతో భారత్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకింది. టీమిండియా టాప్‌ ప్లేస్‌కు చేరడంతో అప్పటివరకు టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి దిగజారింది. ఇక పెర్త్‌లోని ఆప్టస్‌ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ వేదికపై ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఇదే తొలి పరాజయం. ఆప్టస్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా రికార్డుల్లోకెక్కాడు.ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ గత నాలుగు టెస్ట్‌ల్లో మూడింట విజయాలు సాధించింది. గత బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో భారత్‌ చివరి మూడు టెస్ట్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.

భార‌త్ తొలి ఇన్నింగ్స్‌: 150, రెండో ఇన్నింగ్స్‌: 487/6 డిక్లేర్‌

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌: 104, రెండో ఇన్నింగ్స్‌: 238



సంబంధిత వార్తలు