India Vs Pakistan Odi: పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆలౌట్, మరో ఓవర్ మిగిలి ఉండగానే అన్ని వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా

48.5 ఓవర్లలో 266 పరుగులకు (India Score) ఆలౌటైంది. రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ (14) విఫలమయ్యారు.

India Vs Pakistan (PIC@ BCCI X)

Sri Lanka, SEP 02: పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (India Vs Pakistan) బ్యాటింగ్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగులకు (India Score) ఆలౌటైంది. రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ (14) విఫలమయ్యారు. దీంతో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను ఇషాన్‌ కిషన్ (Ishan kishan) (82), హార్దిక్ పాండ్య (87) (Hardik Pandya) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను ఆదుకున్నారు.

పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4,  నసీమ్ షా 3, హారిస్‌ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టారు. అయితే ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్ టీమ్‌ ను బౌలింగ్‌తో కట్టడి చేసేందుకు ఇండియన్ జట్టు.

మరోవైపు భారత్ ఇన్నింగ్ ముగిసిన తర్వాత మరోసారి వర్షం మొదలైంది. దీంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యేందుకు టైం పట్టే అవకాశముంది. వర్షం కారణంగా పాక్ బ్యాటింగ్ ఆలస్యంగా మొదలు అయితే ఓవర్లను కుదించే అవకాశముంది.