India vs England 2nd Test: భారత్‌తో రెండవ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదిగో, గాయపడిన స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్
మోకాలి సమస్యల కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత, ఫిబ్రవరి 2న రెండో ఎన్‌కౌంటర్ ప్రారంభంకానుండగా, రోహిత్ శర్మ సేన విశాఖపట్నంలో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది.
ఇంగ్లండ్ 2వ టెస్టుకు తమ జట్టును ప్రకటించింది . మోకాలి సమస్యల కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత, ఫిబ్రవరి 2న రెండో ఎన్‌కౌంటర్ ప్రారంభంకానుండగా, రోహిత్ శర్మ సేన విశాఖపట్నంలో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. అదే సమయంలో, అన్‌క్యాప్‌డ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్‌కు అరంగేట్రం చేశాడు. అతనికి అభినందనలు తెలిపింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఓటమి, 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం, ఒకరోజు ముందుగానే తేలిన ఫలితం
ఇంగ్లండ్ రెండు మార్పులు చేస్తూ వైజాగ్‌లో జరిగే మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. గాయపడిన జాక్ లీచ్ స్థానంలో అన్‌క్యాప్డ్ స్పిన్నర్ షోయబ్ బషీర్, ఎక్స్‌ప్రెస్ పేసర్ మార్క్ వుడ్ స్థానంలో వెటరన్ జేమ్స్ అండర్సన్ జట్టులోకి వచ్చాడు.
ఇంగ్లాండ్ XI:
1. జాక్ క్రాలీ
2. బెన్ డకెట్
3. ఒల్లీ పోప్
4. జో రూట్
5. జానీ బెయిర్‌స్టో
6. బెన్ స్టోక్స్ (సి)
7. బెన్ ఫోక్స్
8. రెహాన్ అహ్మద్
9. టామ్ హార్ట్లీ
10. షోయబ్ బషీర్
11. జేమ్స్ ఆండర్సన్