India vs South Africa: సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, చేతులెత్తేసిన రోహిత్ సేన, వరల్డ్ కప్ లో తొలి ఓటమి
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న t20 లీగ్ మ్యాచ్లో భారత్ సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. 20వ ఓవర్లో 134 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా జట్టుకు భారత్ అందించింది. హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడిన ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ లు దక్షిణాఫ్రికా జట్టుకు విజయాన్ని అందించారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున సూర్య కుమార్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అతను తప్ప, ఏ భారత బ్యాట్స్‌మెన్ ప్రత్యేకంగా రాణించలేదు. దక్షిణాఫ్రికా తరఫున లుంగి ఎన్‌గిడి నాలుగు, వేన్ పార్నెల్ మూడు వికెట్లు తీశారు.