IPL 2020 List of Players: ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోయిన మరియు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా, అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు, జట్టు వారీగా వివిధ ఫ్రాంచైజీలు దక్కించుకున్న ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి
కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), కెఎక్స్ఐపి జట్లు చెరో తొమ్మిది మంది ఆటగాళ్లను...
గురువారం కోల్‌కతాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 (ఐపీఎల్ 2020) వేలం (IPL 2020 Auction) లో ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి మొత్తం 62 మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. వీరిలో 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ 62 మంది ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు అక్షరాల రూ. 1,40,30,00,000 కోట్లు ఖర్చు చేశాయి. ఈ సీజన్ కి ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఐపిఎల్ 2020 వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ (Pat Cummins) నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR- Kolkata Knight Riders) అతణ్ని రూ.15.50 కోట్లు గుమ్మరించి దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా కమిన్స్ రికార్డులకెక్కాడు.
కమ్మిన్స్ తర్వాతి స్థానంలో, మరో ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు (KXIP) రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. ఇక, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ కి అతడు మూడో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
ఐపిఎల్ 2020 వేలంపాటలో రాజస్థాన్ రాయల్స్ (RR) తక్కువ బిడ్స్ వేస్తూ అందరికంటే ఎక్కువగా 11 మంది కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) జట్లు చెరో తొమ్మిది మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఆర్‌సిబి, దిల్లీ క్యాపిటల్స్ (DC) ఎనిమిది మంది ఆటగాళ్లను, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడుగురు ప్లేయర్లను కొనుగోలు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (MI) ఆరుగురు ఆటగాళ్లను దక్కించుకోగా, అందరికంటే తక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది.
ఐపిఎల్ 2020 వేలంలో ఫ్రాంచైజీలు దక్కించికున్న ఆటగాళ్ల జాబితా
SRH: మిచెల్ మార్ష్, సందీప్ బవనకా, అబ్దుల్ సమద్, విరాట్ సింగ్, ప్రియామ్ గార్గ్, సంజయ్ యాదవ్, ఫాబియన్ అలెన్.
CSK: పియూష్ చావ్లా, రవిస్రినివాసన్ సాయి కిషోర్, సామ్ కుర్రాన్, జోష్ హాజిల్‌వుడ్.
DC: జాసన్ రాయ్, అలెక్స్ కారీ, షిమ్రాన్ హెట్మియర్, క్రిస్ వోక్స్, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్, మోహిత్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.
KXIP: గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హుడా, జేమ్స్ నీషామ్, క్రిస్ జోర్డాన్, ప్రభుసిమ్రాన్ సింగ్, రవి బిష్ణోయ్, తాజిందర్ ధిల్లాన్, షెల్డన్ కాట్రెల్, ఇషాన్ పోరెల్.
KKR: పాట్ కమ్మిన్స్, రాహుల్ త్రిపాఠి, టామ్ బాంటన్, నిఖిల్ నాయక్, వరుణ్ చక్రవర్తి, ఎం సిద్ధార్థ్, ప్రవీణ్ తంబే.
MI: నాథన్ కౌల్టర్-నైలు, మొహ్సిన్ ఖాన్, దిగ్విజయ్ దేశ్ముఖ్, సౌరభ్ తివారీ, క్రిస్ లిన్.
RR : రాబిన్ ఉతప్ప, యషస్వి జైస్వాల్, అనుజ్ రావత్, డేవిడ్ మిల్లెర్, అనిరుధ జోషి, జయదేవ్ ఉనద్కట్, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, ఓషనే థామస్, టామ్ కుర్రాన్, ఆండ్రూ టై.
RCB : ఆరోన్ ఫించ్, జాషువా ఫిలిప్, షాబాజ్ అహ్మద్, పవన్ దేశ్‌పాండే, క్రిస్ మోరిస్, ఇసురు ఉడానా, కేన్ రిచర్డ్‌సన్, డేల్ స్టెయిన్.
ఐపిఎల్ 2020 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు:
హనుమ విహారీ, ఛతేశ్వర్ పూజారా, యూసుఫ్ పఠాన్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, స్టువర్ట్ బిన్నీ, హెన్రిచ్ క్లాసేన్, ముష్ఫికర్ రహీమ్, నమన్ ఓజా, కుశల్ పెరెరా, షాయ్ హోప్, మోహిత్ శర్మ, డేల్ స్టెయిన్, ఆండ్రూ టై, టిమ్ సౌథీ, ఇష్ సౌదీ వాల్ష్, జహీర్ ఖాన్, మంజోత్ కల్రా, రోహన్ కదమ్, హర్‌ప్రీత్ సింగ్, డేనియల్ సామ్స్, పవన్ దేశ్‌పాండే, షారుఖ్ ఖాన్, కేదార్ దేవ్ ధర్, కె.ఎస్.భరత్, ప్రభు సిమ్రాన్ సింగ్, అంకుష్ బెయిన్స్, విష్ణు వినోద్, కుల్వంత్ ఖేజ్రోలియంద్, సుధర్ దేషార్ ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కెసి కారియప్ప, ఎవిన్ లూయిస్, మనోజ్ తివారీ, కోలిన్ ఇంగ్రామ్, మార్టిన్ గుప్టిల్, కార్లోస్ బ్రాత్‌వైట్, మార్కస్ స్టోయినిస్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోలిన్ మున్రో, రిషి ధావన్, బెన్ కట్టింగ్, అన్రిచ్ నార్ట్, మార్క్ బరీందర్, స్రాన్ జోసెఫ్, ముస్తఫిజుర్ రెహ్మాన్, ఆడమ్ మిల్నే, ఆయుష్ బడోని, మరియు ప్రవీణ్ దుబే.