IPL 2023: రూ. 18.5 కోట్లకు న్యాయం చేస్తున్న సామ్ కర్రన్, ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించిన పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌, నిన్న ఆఖరి ఓవర్‌లో పరుగులు నియంత్రించిన స్టార్ బౌలర్

ఐపీఎల్‌-2023లో ఇతర ఖరీదైన ఆటగాళ్లలా కాకుండా అంచనాలను తగ్గట్టుగా రాణిస్తున్నాడు.

Sam Curran (Photo-Twitter/IPL)

ఐపీఎల్‌-2023లో అత్యధిక ధర పలికిన పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ (18.5 కోట్లు) ఇప్పటివరకు అతను‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఐపీఎల్‌-2023లో ఇతర ఖరీదైన ఆటగాళ్లలా కాకుండా అంచనాలను తగ్గట్టుగా రాణిస్తున్నాడు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కర్రన్‌ తర్వాత అత్యంత ఖరీదైన ఆటగాళ్లు కెమారూన్‌ గ్రీన్‌ (ఎంఐ, 17.5 కోట్లు), కేఎల్‌ రాహుల్‌ (లక్నో, 17 కోట్లు), బెన్‌ స్టోక్స్‌ (16.25 కోట్లు) అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతుంటే.. కర్రన్‌ ఫర్వాలేదనిపిస్తున్నాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో (17 బంతుల్లో 26 నాటౌట్‌; 2 సిక్సర్లు), బంతితో (1/38) ఓ మోస్తరుగా రాణించిన అతను.. నిన్న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో ఆఖరి ఓవర్‌లో 16 పరుగులకు డిఫెండ్‌ చేసి (10 పరుగులు మాత్రమే ఇచ్చాడు) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శిఖర్ ధవన్, అత్యధిక హాఫ్‌ సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డు, తొలి స్థానంలో కొనసాగతున్న వార్నర్

రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించి, రన్నింగ్‌ ఎడిషన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కర్రన్‌ ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు డిఫెండ్‌ చేసిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆఖరి ఓవర్‌ అద్భుతమైన మెచ్యూరిటీతో బౌల్‌ చేశాడని కితాబునిస్తున్నారు. కర్రన్‌ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే ఈ ఏడాది పంజాబ్‌ కింగ్స్‌ టైటిల్‌ కల సాకారమవుతుందని అంటున్నారు.