Shikhar Dhawan (Twitter/ IPL)

టీమిండియా స్టార్ ధవన్‌ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌(54 అర్థసెంచరీలు) తర్వాత అత్యధిక హాఫ్‌ సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా.. టీమిండియా తరపున తొలి బ్యాటర్‌గా ధావన్‌ నిలిచాడు. ఇక కింగ్‌ కోహ్లి 45 హాఫ్‌ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌పై ధావన్‌కు ఇది ఏడో హాఫ్‌ సెంచరీ.ఐపీఎల్‌లో ధావన్‌కు ఇది 48వ అర్థసెంచరీ కాగా ఓవరాల్‌గా అతనికి ఇది 50వ 50ప్లస్‌ స్కోరు కావడం విశేషం.

పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్, ధావన్ కొట్టిన షాట్‌ దెబ్బకు విధ్వంసక ఆటగాడు రాజపక్స ఐపీఎల్ నుంచి దూరమయ్యే అవకాశాలు

అయితే సీఎస్‌కేపై ధవన్‌ ఎనిమిది అర్థసెంచరీలు సాధించాడు. ఆ తర్వాత తాను ప్రస్తుతం ఆడుతున్న పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌పై ఏడు అర్థసెంచరీలు, ముంబై, కేకేఆర్‌, ఆర్‌సీబీలపై ఆరు అర్థసెంచరీలు సాధించాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌పై ధావన్‌ 22 మ్యాచ్‌ల్లో 126 స్ట్రైక్‌రేట్‌తో 576 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 85 పరుగుల ఇ‍న్నింగ్స్‌ ధావన్‌కు అత్యధిక స్కోరుగా ఉంది.

రాజస్థాన్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్, బోణీ కొట్టిన శిఖర్ ధావన్ సేన..

బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధావన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి వరకు నిలిచిన గబ్బర్‌ 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 86 నాటౌట్‌ వింటేజ్‌ ధావన్‌ను తలపించాడు.