రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఆటగాడు బానుక రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ కొట్టిన స్ట్రెయిట్ షాట్ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దీంతో బానుక నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతికి ఇది చోటుచేసుకుంది.
ఫిజియో వచ్చి రాజపక్సను పరిశీలించగా.. చేయి వాచిపోయింది. దీంతో బ్యాట్ పట్టుకోవడం కష్టమవడంతో రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. బంతి చేతికి బలంగా తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ముందుగా రాజపక్సకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్ట్‌లో పాజిటివ్ వస్తే రాజపక్స ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే పంజాబ్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.
రాజస్థాన్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్, బోణీ కొట్టిన శిఖర్ ధావన్ సేన..
అంతకముందు ప్రబ్‌సిమ్రన్ సింగ్ 34 బంతుల్లోనే 60 పరుగులు సాధించి పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. రాజస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడిన ప్రబ్‌సిమ్రన్ మైదానం నలువైపులా షాట్లు ఆడి తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా ప్రబ్‌సిమ్రన్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి అర్థశతకం కావడం విశేషం.పంజాబ్ కింగ్స్ భారీ స్కోరుతో రెండో విజయం నమోదు చేసింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన పోరులో శిఖర్ ధావన్ బృందం 5 పరుగులతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది.