IPL 2023 Final: గుజరాత్ అంటే బ్యాటింగ్‌లో పూనకాలతో ఊగిపోతున్న రుతురాజ్‌ గైక్వాడ్‌, ఈ సారి ఏం బాదుడు బాదుతాడోనంటూ వణిపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌

ఈ మ్యాచ్ లో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను చూసి గుజరాత్ టైటాన్స్ వణికిపోతోంది. ఈ సీఎస్‌కే ఓపెనర్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు బాదాడు. దీంతో ఈ సారి ఏం బాదుడు బాదుతాడోనని గుజరాత్ వణుకుతోంది.

Ruturaj Gaikwad

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డే నేటికి వాయిదా పడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను చూసి గుజరాత్ టైటాన్స్ వణికిపోతోంది. ఈ సీఎస్‌కే ఓపెనర్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు బాదాడు. దీంతో ఈ సారి ఏం బాదుడు బాదుతాడోనని గుజరాత్ వణుకుతోంది.

క్వాలిఫయర్‌-1లో 44 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 60 పరుగులు చేసిన రుతురాజ్.. ఈ సీజన్‌ ఓపెనర్‌లో 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అంతకుముందు సీజన్‌లో తొలి మ్యాచ్‌లో 48 బంతుల్లో 73 పరుగులు చేసిన గైక్వాడ్‌.. ఆ తర్వాతి మ్యాచ్‌లో 49 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మొత్తంగా రుతురాజ్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించి 278 పరుగులు స్కోర్‌ చేశాడు. ఐపీఎల్‌లో మరే ఆటగాడు గుజరాత్‌పై ఇన్ని పరుగులు చేయలేదు.ఈ నేపథ్యంలో నేటి ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఇదే రికార్డు గుజరాత్‌ బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

సోమవారం కూడా ఫైనల్ మ్యాచ్‌ జరుగకపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్‌ నిబంధనలు ఏం చెప్తున్నాయి? రూల్స్ ప్రకారం ట్రోఫీ ఎవరికి దక్కుతుందంటే!

కాగా ఇవాళ జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌కు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

New Model Kia Syros Car: మార్కెట్లోకి కియా మ‌రో కొత్త కారు, అదిరిపోయే ఫీచ‌ర్ల‌కు, ఆక‌ట్టుకునే ధ‌ర‌తో తీసుకొస్తున్న కియా

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif