IPL 2023: మాకు ఆ ఇద్దరు ఫినిషర్లు ఉంటే దుమ్ము రేపే వాళ్లం, కీలక వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్‌ కోచ్, తెవాటియా, మిల్లర్‌ లాంటి ప్లేయర్లు ఉండాలని సూచన

ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కోచ్ బ్రియాన్ లారా కీలక వ్యాఖ్యలు చేశారు.

Brian Lara (Video Grab/IPL)

ఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌.. ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కోచ్ బ్రియాన్ లారా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ జట్టు మిడిలార్డర్‌ను మరింత పటిష్టం చేయాల్సి ఉందని.. ఇందుకోసం కసరత్తులు చేస్తున్నామని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ అన్నాడు.

ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చగల ఫినిషర్ల అవసరం ఉందని పేర్కొన్నాడు. తెవాటియా, మిల్లర్‌ లాంటి ఆటగాళ్లు సన్‌రైజర్స్‌లో కూడా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను ఎలా ఫినిష్‌ చేయాలో వాళ్లకు తెలుసు. అలాంటి వాళ్లను తయారు చేసుకోగలగాలి. మేము ఆ పనిలోనే ఉన్నాం. ఈరోజైతే మేము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడిపోయాం అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు.2022లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న రాహుల్‌ తెవాటియా, డేవిడ్‌ మిల్లర్‌ ఫినిషర్లుగా అద్భుత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఉప్పల్ స్టేడియంలో చేతులెత్తేసిన సన్ రైజర్స్ హైదరబాద్, ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓటమి...బౌలింగ్ లో మెరిసిన అర్జున్ టెండూల్కర్..

తాజా ఓటమితో సన్‌రైజర్స్‌ పరాజయాల సంఖ్య మూడుకు చేరగా 4 పాయింట్లతో పట్టికలో తొమ్మిదోస్థానానికి పడిపోయింది.ముంబై విసిరిన 192 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టార్గెట్‌ చేధించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 19.5 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. దీంతో 14 పరుగుల తేడాతో రోహిత్‌ సేన చేతిలో ఓటమిపాలైంది.

ఉప్పల్ స్టేడియంలో తాగుబోతుల హంగామా.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ

ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో రైజర్స్‌ గెలుపొందాలంటే 20 పరుగులు అవసరమైన వేళ.. రోహిత్‌ శర్మ..అర్జున్‌ టెండుల్కర్‌ చేతికి బంతినిచ్చాడు. అప్పటికి భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు క్రీజులో ఉన్న అబ్దుల్‌ సమద్‌.. చివరి ఓవర్‌ రెండో బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మయాంక్‌ మార్కండే క్రీజులోకి రాగా.. రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బై రూపంలో ఒక పరుగు రాగా.. మరుసటి బంతికి అర్జున్‌.. భువీని పెవిలియన్‌కు పంపడంతో సన్‌రైజర్స్‌ కథ ముగిసింది.



సంబంధిత వార్తలు

Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

Traffic Restrictions In Hyderabad:హైద‌రాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్లో వెళ్లేవారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif