IPL 2024: పంజా విసిరిన కోల్‌కతా నైట్ రైడర్స్, 7 వికెట్ల తేడాతో పంత్ సేనపై గెలుపు, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలైమై ఓటమిని మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను మరోసారి చిత్తుగా ఓడించింది. 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ (68), శ్రేయస్ అయ్యర్ (33), వెంకటేశ్ అయ్యర్ (26) పరుగులు చేశాడు.
Kolkata Knight Riders vs Delhi Capitals IPL 2024 Live Score: ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను మరోసారి చిత్తుగా ఓడించింది. 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ (68), శ్రేయస్ అయ్యర్ (33), వెంకటేశ్ అయ్యర్ (26) పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఔట్, టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టును ప్రకటించిన బ్రియాన్ లారా
తొలుత బౌలర్లు పంత్ సేనను తక్కువకే కట్టడి చేయగా.. స్వల్ప ఛేదనలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(68) అర్ధ శతకంతో కదం తొక్కాడు. ఆతర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(33 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(26 నాటౌట్)లు ఆడుతూ పాడుతూ కోల్‌కతాను గెలిపించారు. దాంతో, మరో బంతులు ఉండగానే మ్యాచ్ ముగించింది. ఇక బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలైమన ఢిల్లీ హ్యాట్రిక్ విజయం నమోదు చేయలేకపోయింది.