వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంచుకున్నాడు. తన జట్టులో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌, స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌లకు చోటు ఇవ్వలేదు. లారా తన జట్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు.  పాకిస్తాన్ గడ్డ మీద టీమిండియా కాలు పెడుతుందా? ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ వేదికలను ఖరారు చేసిన పాకిస్తాన్

అదే విధంగా స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌, రిషబ్ పంత్‌లను లారా ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబేలకు చోటు దక్కింది. ఇక ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో అనూహ్యంగా సందీప్ శర్మను లారా ఎంపిక చేశాడు. అతడితో పాటు పేస్‌ సంచలనం మయాంక​్‌ యాదవ్‌కు సైతం లారా అవకాశమిచ్చాడు.వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు ఫాస్ట్‌ బౌలర్లగా బ్రియాన్‌ ఎంపిక చేశాడు. ఇక చివరగా లారా జట్టులో స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నారు.టీ20 వరల్డ్‌కప్‌-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మరో 48 గంటల్లో ప్రకటించనుంది,

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)