Cricket Australia's Test Team of 2024: క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్ ఔట్, సీఎ మెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ఇదిగో..
అయితే, ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా రేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్ ను కాదని బుమ్రాను సారథిగా ఎంపిక చేయడం గమనార్హం.
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 2024 ఏడాదికి గాను 11 మంది ఆటగాళ్లతో మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది. అయితే, ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా రేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్ ను కాదని బుమ్రాను సారథిగా ఎంపిక చేయడం గమనార్హం. అలాగే భారత్ నుంచి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు కూడా జట్టులో చోటు కల్పించింది.
22 ఏళ్ల ఈ యువ ప్లేయర్ ఈ ఏడాది మొత్తం 15 టెస్టు మ్యాచ్ లు ఆడి 54.74 సగటుతో ఏకగా 1,478 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 214 నాటౌట్. ఇక బుమ్రా కూడా ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచ్ లు ఆడిన ఈ స్పీడ్‌స్టర్ 71 వికెట్లు పడగొట్టాడు. 5 సార్లు ఫైఫర్ నమోదు చేశాడు. దీంతో భారత్ నుంచి ఈ ఇద్దరికి మాత్రమే సీఏ తన జట్టులో చోటు కల్పించింది.
అలాగే ఇంగ్లండ్ నుంచి బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ లకు ఈ జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ ఎంపికయ్యారు. ఇక శ్రీలంక నుంచి కమిందు మెండీస్... ఆస్ట్రేలియా నుంచి అలెక్స్ కెరీ, జోష్ హేజిల్‌వుడ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌కు చోటు దక్కడం విశేషం.
జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, జోష్ హేజిల్‌వుడ్, కేశవ్ మహారాజ్