RR Vs RCB: వృథాగా మారిన విరాట్ కోహ్లీ సెంచ‌రీ, వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్, జోస్ బ‌ట్ల‌ర్ చెల‌రేగ‌డంతో 6 వికెట్ల తేడాతో విక్ట‌రీ

విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతంగా పోరాడి సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. జోస్ బట్ల‌ర్ సెంచ‌రీతో రాజ‌స్థాన్ కు విక్ట‌రీ సాధించాడు.

Jos Buttler (PIC@ IPL X)

Jaipur, April 06: ఈ ఏడాది ఐపీఎల్ లో వ‌రుసగా నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (RR). విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతంగా పోరాడి సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. జోస్ బట్ల‌ర్ సెంచ‌రీతో రాజ‌స్థాన్ కు విక్ట‌రీ సాధించాడు. దీంతో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్‌ బ్యాటర్లు జోస్‌ బట్లర్‌ (Jos Buttler) (100*; 58 బంతుల్లో) అద్భుత శతకం, సంజు శాంసన్‌ (69; 42 బంతుల్లో) చెలరేగి ఆడారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 183 పరుగులు చేసింది. కోహ్లీ (113*) ఈ సీజన్‌లో తొలి శతకం బాదేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో రీస్‌ టాప్‌లీ 2, సిరాజ్‌ 1, యశ్‌ 1 వికెట్‌ తీశారు.

 

అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113*; 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకం బాదాడు. ఈ సీజన్‌లో నమోదైన మొదటి సెంచరీ ఇదే. డుప్లెసిస్‌ (44; 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1), సౌరభ్‌ చౌహన్‌ (9) నిరాశపర్చారు. రాజస్థాన్‌ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 2, నంద్రి బర్గర్ ఒక వికట్ పడగొట్టారు.