KKR vs SRH, IPL 2021: హైదరాబాద్ ఇంటికి..కోల్‌కతా ముందుకు, సన్ రైజర్స్‌పై 6 వికెట్లతో ఘన విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 6 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.

KKR (Photo Credits: Twitter/IPL)

ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో (KKR vs SRH, IPL 2021) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 6 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 57 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నితీష్‌ రాణా 25 పరుగులతో రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో హూల్డర్‌ 2, రషీద్‌ ఖాన్‌, సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో వికెట్‌ తీశారు.

ఈ విజయంతో కేకేఆర్‌ (Kolkata Knight Riders) ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక చివరి మ్యాచ్‌ను కేకేఆర్‌ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆదివారం ఆఖరి ఓవర్‌ వరకు సాగిన లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ శుభ్‌మన్‌ గిల్‌ (51 బంతుల్లో 10 ఫోర్లతో 57) సత్తాచాటడంతో 6వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ తాజాగా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది.

మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులే చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (26) టాప్‌ స్కోరర్‌ కాగా.. జాసన్‌ రాయ్‌ (10), వృద్ధిమాన్‌ సాహా (0), ప్రియం గార్గ్‌ (21), అబ్దుల్‌ సమద్‌ (25), అభిషేక్‌ శర్మ (6), జాసన్‌ హోల్డర్‌ (2) విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో సౌథీ, వరుణ్‌ చక్రవర్తి, శివం మావి తలా రెండు వికెట్లు పడగొట్టారు.

చేజారిన ముంబై ప్లే అప్ అవకాశాలు, 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం, అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (57; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (8), రాహుల్‌ త్రిపాఠి (7) త్వరగానే ఔటవడంతో హైదరాబాద్‌ పుంజుకునే అవకాశం వచ్చినా.. ఆఖర్లో నితీశ్‌ రాణా (25), దినేశ్‌ కార్తీక్‌ (18) ధాటిగా ఆడి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: జేసన్‌ రాయ్‌ (సి) సౌథీ (బి) మావి 10; సాహా (ఎల్బీ) సౌథీ 0; విలియమ్సన్‌ (రనౌట్‌/షకీబల్‌) 26; ప్రియమ్‌ గార్గ్‌ (సి) త్రిపాఠి (బి) చక్రవర్తి 21; అభిషేక్‌ శర్మ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) షకీబల్‌ 6; సమద్‌ (సి) గిల్‌ (బి) సౌథీ 25; హోల్డర్‌ (సి) అయ్యర్‌ (బి) చక్రవర్తి 2; రషీద్‌ (సి) అయ్యర్‌ (బి) మావి 8; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 7; సిద్దార్థ్‌ కౌల్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 115/8; వికెట్ల పతనం: 1-1, 2-16, 3-38, 4-51, 5-70, 6-80, 7-95, 8-103; బౌలింగ్‌: టిమ్‌ సౌథీ 4-0-26-2, శివమ్‌ మావి 4-0-29-2, వరుణ్‌ చక్రవర్తి 4-0-26-2, షకీబల్‌ 4-0-20-1, నరైన్‌ 4-0-12-0.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ (సి) హోల్డర్‌ (బి) కౌల్‌ 57; వెంకటేశ్‌ (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 8; త్రిపాఠి (సి) అభిషేక్‌ (బి) రషీద్‌ 7; నితీష్‌ (సి) సాహా (బి) హోల్డర్‌ 25; దినేష్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 18; మోర్గాన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 19.4 ఓవర్లలో 119/4; వికెట్ల పతనం: 1-23, 2-38, 3-93, 4-106; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-20-0; హోల్డర్‌ 4-0-32-2; ఉమ్రన్‌ 4-0-27-0; రషీద్‌ 4-0-23-1; సిద్దార్థ్‌ 3.4-0-17-1.