LSG vs SRH Highlights, IPL 2023: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్, సొంత గడ్డపై లక్నో సూపర్‌ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ

మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ (SRH) హైద‌రాబాద్‌పై గెలుపొందింది. మొద‌ట స్పిన్ ఉచ్చుతో హైదరాబాద్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించిన ల‌క్నో.. ఆ త‌ర్వాత స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 4 ఓవ‌ర్లు ఉండ‌గానే ఛేదించింది. కెప్టెన్ కెప్టెన్ రాహుల్(35), కృనాల్ పాండ్యా(34) (Pandya) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.

IPL Trophy Representative Image (Photo Credits: Twitter)

Lucknow, April 08: ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Super Giants) సొంత గ‌డ్డ‌పై రెండో విజ‌యం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ (SRH) హైద‌రాబాద్‌పై గెలుపొందింది. మొద‌ట స్పిన్ ఉచ్చుతో హైదరాబాద్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించిన ల‌క్నో.. ఆ త‌ర్వాత స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 4 ఓవ‌ర్లు ఉండ‌గానే ఛేదించింది. కెప్టెన్ కెప్టెన్ రాహుల్(35), కృనాల్ పాండ్యా(34) (Pandya) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. అన్ని విభాగాల్లో విఫ‌ల‌మైన హైద‌రాబాద్ వ‌రుస‌గా రెండో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో ప‌వ‌ర్ ప్లేలో రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. డేంజ‌ర‌స్ కైల్ మేయ‌ర్స్‌(13)ను ఫ‌జ‌ల్‌హ‌క్ ఫారుఖీ ఔట్ చేశాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఒంటి చేత్తో అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్ట‌డంతో దీప‌క్ హుడా (7) వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత‌.. కేఎల్ రాహుల్(18) కృనాల్ పాండ్యా(34) ధాటిగా ఆడి స్కోర్‌బోర్డును ప‌రుగులు పెట్టించారు. వీళ్లు మూడో వికెట్‌కు 55 ర‌న్స్ జోడించారు.

ఆదిల్ ర‌షీద్ (Rashid) 15వ ఓవ‌ర్‌లో రాహుల్, రొమ‌రియో షెఫ‌ర్డ్‌(0)ను వ‌రుస బంతుల్లో ఎల్బీగా ఔట్ చేశాడు. నికోల‌స్ పూర‌న్(11), మార్క‌స్ స్టోయినిస్(10) అజేయంగా నిలిచి జ‌ట్టును గెలిపించారు. విజ‌యానికి రెండు పరుగులు కావాల్సిన ద‌శ‌లో నికోల‌స్ పూర‌న్(11) సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో ఆదిల్ ర‌షీద్ రెండు వికెట్లు తీశాడు. ఫ‌జ‌ల్‌హ‌క్ ఫారుఖీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్‌ను కృనాల్ పాండ్యా దెబ్బ‌కొట్టాడు. ఒకే ఓవ‌ర్‌లో వ‌రుస బంతుల్లో ఓపెన‌ర్ అల్మోన్ సింగ్ (33), ఎయిడెన్ మ‌ర్‌క్రం(0)ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లో బిష్ణోయ్ ప్ర‌మాద‌క‌ర‌మైన హ్యారీ బ్రూక్‌(3)ను వెన‌క్కి పంపాడు. 55 ప‌రుగుల‌కే కీల‌క బ్యాట‌ర్లంతా పెవిలియ‌న్ చేరారు. ఆ ద‌శ‌లో రాహుల్ త్రిపాఠి (35), వాషింగ్ట‌న్ సుంద‌ర్(16) ఆచితూచి ఆడారు. వీళ్లు ఐదో వికెట్‌కు 39 ర‌న్స్ జోడించారు. అమిత్ మిశ్రా 18వ ఓవ‌ర్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్(14), ఆదిల్ ర‌షీద్‌(4)ను ఔట్ చేశాడు. దాంతో, హైద‌రాబాద్ వంద లోపే ఆలౌట్ అయ్యేలా క‌నిపించింది. కానీ, అబ్దుల్ స‌మ‌ద్(21) ఆఖ‌రి ఓవ‌ర్‌లో రెండు సిక్స్‌లు కొట్టడంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది.